25 July, 2026 | 11:39 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

హుజూర్ నగర్ నుండి భారీగా తరలిన జాగృతి శ్రేణులు

25-04-2026 11:46 AM

కవిత నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు హుజూర్ నగర్ నుండి భారీగా తరలిన జాగృతి శ్రేణులు

హుజూర్ నగర్, ఏప్రిల్ 25: తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం కవిత నాయకత్వంలో ఏర్పాటు కానున్న నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి భారీగా జాగృతి శ్రేణులు తరలివెళ్ళారు.ఈ సందర్భంగా జాగృతి రాష్ట్ర నాయకులు కె యల్ యన్ రావు, యారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... బిఆర్ఎస్ పది సంవత్సరాలు,కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పాలనలో తెలంగాణ ప్రజాల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుక గా నూతన రాజకీయ శక్తిగా కవిత రావడం శుభ పరిణామన్నారు. సభకు తరలి వెళ్లిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్, బండి రాహుల్,బిక్షం,మామిడి పన్నీరు, నర్సింహారావు,చంటి, గుండు శ్రీను,గోపి,నజీర్, పద్మ, శాంతి, కిరణ్ రెడ్డి, వెంకటేష్,ప్రకాష్,నాగు నాయక్ తదితరులు,పాల్గొన్నారు.