25 April, 2026 | 1:20 PM

పెళ్లి ముహూర్తం ఫిక్స్... ప్రియురాలి ప్రాణం తీసిన ప్రేమికుడు

25-04-2026 11:42 AM

మహబూబాబాద్, (విజయక్రాంతి): ప్రేమించిన ప్రియురాలితో వారం రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం నిర్ణయించి.. నమ్మించి ఆమెను బావిలో తోసి చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ప్రియుడు అజ్మీర అరవిందును శనివారం మరిపెడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. మరిపెడ పట్టణానికి చెందిన గోవింద్, గిరిపురం కు చెందిన బుక్య సంగీత రెండేళ్లుగా ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో ఈనెల 29న వివాహం చేసుకోవడానికి నిశ్చయించారు.

ఈ క్రమంలో అరవింద్ ఇంట్లో జరిగే శుభకార్యానికి గత మంగళవారం సంగీత బంధువులతో పాటు వెళ్లింది. ఆమెను నమ్మించి గోవిందు సైకిల్ మోటార్ పై బయటకు తీసుకెళ్లి బావిలోకి తోసి చనిపోయేంత వరకు అక్కడే ఉండి ఆ తర్వాత వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని సాంకేతిక పరిజ్ఞానం, సాక్షుల సమాచారం ఆధారంగా సంగీతను గోవిందు హత్య చేశాడని నిర్ధారించి, అతనిపై మర్డర్ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.