3 August, 2026 | 5:17 AM

తల్లిపాలతోనే శిశువుకు ఆరోగ్యం

03-08-2026 01:47 AM

‘కిమ్స్’ ఆధ్వర్యంలో వాక్‌థాన్ 

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా కొండాపూర్‌లోని కిమ్స్ కడిల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాధాన్యంపై వారం రోజుల అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం వాక్‌థాన్ నిర్వహించగా వైద్యులు, నర్సులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ యూనిట్స్ నియోనటాలజీ అకడామిక్స్, రీసెర్చ్ రీజినల్ డైరెక్టర్, నియోనటాలజీ విభాగాధిపతి, కిమ్స్ కడల్స్, కొండాపూర్ డా. అపర్ణ సి. కిమ్స్ కడల్స్ లాక్టేషన్ కన్సల్టెంట్ అర్చనారెడ్డి సి, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి. భాస్కర్ రావు మాట్లా డుతూ.. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందించడమే కాకుండా రోగనిరో ధక శక్తిని పెంచి, మెదడు ఎదుగుదలకు దోహదపడతాయని వైద్యులు తెలిపారు.

పుట్టిన తర్వాత తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. వారం రోజుల పాటు గర్భిణులు, బాలింతలు, కు టుంబీకులకు కౌన్సెలింగ్, ప్రత్యక్ష ప్రదర్శనలు, క్విజ్, అవగాహన సమావేశాలు, స్కిట్ పోటీలు నిర్వహించారు. తల్లిపాలపై అపోహలను తొలగిస్తున్నట్లు తెలిపారు.