బరితెగించిన మట్టి మాఫియా!
- అధికార పార్టీ పేరుతో దందా సాగిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు
- కోట్పల్లి ప్రాజెక్ట్ నుండి కందనెల్లి తాండ ఇటుక బట్టీలకు రైతుల పేరుతో అనుమతులు..
- బట్టీల రవాణాకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధి బరితెగింపు
- అధికారుల హెచ్చరికలు నామమాత్రమే?
- వికారాబాద్ జిల్లాలో అక్రమ మట్టి దందా
తాండూరు, జూన్ ౭ ,(విజయ క్రాంతి ): జిల్లాలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయి న కోట్పల్లి ప్రాజెక్టు నుండి నల్ల మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రైతుల భూములు సారవంతం చేసుకునేందుకు అంటూ అనుమతులు తీసుకున్న కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు అక్రమార్కులు, హిటాచి లాంటి భారీ యంత్రాల తో తవ్వకాలు జరుపుతూ టిప్పర్, ట్రాక్టర్లతో ఆ మట్టిని నేరుగా ఇటుక బట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వె ల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ తతంగం వె నుక దారూరు మండలం నాగసమందర్ గ్రామానికి చెందిన అధికార పార్టీ ఓ ప్రజా ప్రతినిధి హస్తమునట్లు తెలుస్తోంది.
ఇరిగేష న్ శాఖ నిబంధనల ప్రకారం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోని సిల్ట్, నల్ల మట్టిని కేవ లం వ్యవసాయ భూముల సారవంతానికి మాత్రమే తవ్వుకునేందుకు అనుమతి ఇస్తా రు. రైతుల పేర్లతో దరఖాస్తులు పెట్టించి ప ర్మిషన్లు తీసుకుంటున్న ముఠాలు, రేయింబవళ్లు టిప్పర్ల కొద్దీ మట్టిని తవ్వి ఒక్కో టిప్పర్ కు రూ 8000 నుండి 12వేల వరకు విక్రయి స్తూ యదేచ్చగా అక్రమ రవాణాకు పాల్పడు తూ ఇటుక బట్టీలకు విక్రయిస్తూ దర్జాగా సొ మ్ము చేసుకుంటున్నారు.
పెద్దేముల్ మండ లం కందనెల్లి తాండ వద్ద ఉన్న ఇటుక బట్టీ లో నల్ల మట్టి భారీ కొండలా దర్శనమిస్తుం ది. ఈ విషయమై సంబంధిత ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా ‘అనుమతులు కే వలం రైతు భూములకు మాత్రమే. ఇతరత్రా ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకుంటాం‘ అని మొక్కుబడి సమాధానం చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో తనిఖీలు లేవు, కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు.
నిబంధనల ప్రకారం సైట్లో లాగ్ బుక్ పెట్టి ఎంత మట్టి తీశారు, ఎన్ని ట్రిప్పులు వేశారో నమోదు చేయాలి. కానీ ఎక్కడా లాగ్ బుక్లు లేవు, పర్యవేక్షణ అధికారులు కనిపించరు. దీంతో రోజుకు వందల సంఖ్యలో టిప్పర్ల మట్టి ఇటుక బట్టీలకు అక్రమంగా రవాణా చేస్తూ తరలిపోతోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు, జిల్లా కలెక్టర్, SP స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లో తనిఖీలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






