31 July, 2026 | 10:10 PM

క్రీడలతో పాటు మంచి విలువలు అలవర్చుకోవాలి: పోలీసు అధికారులు

31-07-2026 09:17 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం పోలీసుస్టేషన్ పరిది లో ని మల్లాపూర్‌ సూర్యనగర్ కాలనీలో క్రీడా సాధన చేస్తున్న చిన్నారులను ఈరోజు నాచారం ఇన్‌స్పెక్టర్ ధనుంజయ్, సబ్ ఇన్స్పెక్టర్ మైబిల్లి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రజిని సత్యప్రసాద్ కలిసి కలుసుకుని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడిన అధికారులు, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

నేటి యువత సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మాదకద్రవ్యాలు, చెడు అలవాట్లు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు. లక్ష్యసాధన కోసం కష్టపడి శ్రమిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ప్రోత్సహించారు.పిల్లలు ఉత్సాహంగా క్రీడా సాధన చేస్తుండటంపై అధికారులు అభినందనలు తెలియజేసి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.