కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ జన్మదిన వేడుకలు
31-07-2026 09:06 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలో కాంగ్రెస్ పార్టీ నాగిరెడ్డిపేట్ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి శ్రీధర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అల్ ఇండియా బంజారా సేవ సంఘం మండలం అధ్యక్షులు దేవసొత్ రమేష్ నాయక్,గిరిజన శక్తి మాజీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్, మైను,జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమామ్ సాబ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫరుక్ సాబ్, శంకర్, హరి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






