31 July, 2026 | 10:10 PM

సారూ.. జ‌ర జూడండి..

31-07-2026 09:09 PM

పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి రావ‌డం లేదు..

పెద్దసార్లకు కోరుతున్న చీల‌ప‌ల్లి గ్రామ‌స్తులు..

 మునిప‌ల్లి,(విజ‌య‌క్రాంతి): మండ‌ల  ప‌రిధిలోని చీల‌ప‌ల్లి గ్రామం అన‌గానే  ఆ గ్రామ‌మా అక్క‌డుంది అక్క‌డ  ఎవ‌రు వ‌స్తారు  రోడ్డు బాగులేదు పెద్దసార్లు ఎవ‌రు రారులే అనుకుంటుండేమో ఆ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి టైంకు రారు  వ‌చ్చినా ఆయ‌న ఇష్టం గంట సేపు ఉంటాడు వెళ్తాడు  ఏమైనా ప‌ని ఉండి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయ‌రు అంటూ  చీల‌ప‌ల్లి గ్రామ‌స్తులు వాపోతున్నారు.  పంచాయతీకి సంబంధించి కార్య‌ద‌ర్శి రాముకు చెప్పుకుందామ‌నుకుంటే ఆయ‌న రారు జ‌ర జూడిండ్రి సారూ అంటూ గ్రామ‌స్తులు  మండ‌ల పెద్దసార్లను  వేడుకుంటున్నారు  అదే  జ‌రిగి శుక్ర‌వారం  ఉద‌యం నుంచి ఆ పంచాయ‌తీ  కార్య‌ద‌ర్శి కోసం  కొంత మంది  గ్రామ‌స్తులు, వృద్దులు కార్యాల‌యం వ‌ద్ద వేచి చూస్తున్నామ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు  ఇప్ప‌టికైనా సంబంధిత అధికారులు స్పందించి స‌మ‌యపాల‌న పాటించ‌ని పంచాయ‌తీ  కార్య‌ద‌ర్శి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  కొంత మంది గ్రామ‌స్తులు కోరుతున్నారు.