31 July, 2026 | 10:09 PM

గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్

31-07-2026 09:23 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంపూర్లోని ఇంటిలో గంజాయి  దాచిన ఈగల్ టీమ్ కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజును శుక్రవారం రోజున కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడికి చిగురుమామిడి మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ మిత్రుడు, శ్రీనివాస్ కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అను అతనితో బూతగదలు కలవు.

దానితో నాగరాజు ఇంక కొంత మందితో కలిసి వరంగల్ నుండి గంజాయి తెప్పించి శ్రీనివాస్ రెడ్డికి చెందిన దుకాణంలో కిలో గంజాయి పెట్టించి అతనిపై చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారు. మిగిలిన  గంజాయిని కానిస్టేబుల్ నాగరాజు సీతారంపూర్ తను నివాసం ఉంటున్న ఇంటిలో దాచగా, కొత్తపల్లి పోలీసులు సమాచారం మేరకు వెళ్ళి తనిఖీ చేయగా నాగరాజు వద్ద 370.96 గ్రాముల గంజాయిని పట్టుకోవడం జరిగింది. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కొత్తపల్లి సిఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు.