8 June, 2026 | 3:47 AM

బస్తీల్లో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయి

08-06-2026 12:00 AM

అధికారులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ హితవు

ముషీరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): అధికారులు ఆఫీసుల్లో కూ ర్చుంటే సమస్యలు తెలియవని, స్థానిక బస్తీ, కాలనీలలో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయ ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆదివారం ముషీరాబాద్ లోని వినోబా నగర్ లో స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ వినోద్ నగర్ లో పర్యటించారు.

ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎన్నడు లేని విధంగా ముషీరాబాద్ లో నీటి ఎద్దడి నెలకొన్నదని పేర్కొన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోయి బోర్లు పనిచేయడం లేదన్నారు. వాటర్ ట్యాంకర్లు కావాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

సమస్యలపై ఫిర్యాదు చేస్తే డబ్బులు లేవు పనులు చేపట్టలేమని అధికారులు పేర్కొంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్  ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, డివిజన్ మాజీ అధ్యక్షుడు బిక్షపతి యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.