31 July, 2026 | 8:20 PM

Breaking News

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •   మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ   •  

రాజ్యాంగం ద్వారానే మైనారిటీలకు సమాన అవకాశాలు

08-06-2026 12:00 AM

ఘట్ కేసర్, జూన్ 7 (విజయక్రాంతి) : భారత రాజ్యాంగం ద్వారా మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని యువ నాయకులు షేక్ సలీం అన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మీసాల అరుణ్ కుమార్  నేతృత్వంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 269వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం ఘట్కేసర్ పట్టణంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా షేక్ సలీం  విచ్చేసి అంబేద్కర్  విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సలీం మాట్లాడుతూ ప్రతివారం అంబేద్కర్ ని స్మరించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంతో ఎస్సి, ఎస్టిలా కంటే వెనకబడిన తరగతులు  ఎక్కువ రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తిని ఈ విధంగానే ప్రజలలోకి తీసుకువెళ్లాలని  కోరుకుంటు ఈ కార్యక్రమంకు విచ్చేసిన ప్రతి ఒకరికి జై భీంలు తెలియజేసారు.

ఇలాంటి చైతన్య కార్యక్రమాల ద్వారా భవిష్యత్తు తరాలకి మనం అందించే గొప్ప మార్గం అంబేద్కరిజం అని చెప్పారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్య పరుస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమం లో మేకల దాస్, అజ్జు, ఫయాజ్, ఫర్హాన్, కట్కూరి నర్సింగ్ రావు, బండారి రాందాస్, మీసాల రాజేష్ కుమార్, కడప రవి, తోట శ్రీనివాస్, బాలనగరం గణేష్ గౌడ్, ఇ. విష్ణు, ఎం. భరత్ తదితరులు పాల్గొన్నారు.