31 July, 2026 | 10:10 PM

ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయ్యాలి

31-07-2026 09:04 PM

కల్హేర్ మండల బీజేపీ మండల అధ్యక్షుడు యెన్నం అనిల్ రెడ్డి

కల్హేర్: మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం బిజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు యెన్నం అనిల్ రెడ్డి మాట్లాడుతూ..పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కే తప్ప బిచ్చం కాదని, రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య చాలా కాలంగా విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఆయనను విమర్శించడం సరికాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బిజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ సాయి పటేల్, మండల ప్రధాన కార్యదర్శి అరవింద్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.