29 July, 2026 | 12:42 AM

సమాచారం ఇస్తున్నా స్పందించరెందుకు?

29-07-2026 12:00 AM

రాత్రికి రాత్రే ఇసుక దర్జాగా తరలింపు  

బాలానగర్ జులై 28: అధికారులకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై మక్కువ ఉండాలి.. ఆ దిశగానే అడుగులు వేయాలి అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందంటూ బాలానగర్ లారీ అసోసియేషన్ అధ్యక్షులు కాట్రవత్ రమేష్ అంటుండ్రు. తాము ప్రభుత్వ అనుమతులతోనే ఇసుక రవాణా చేస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

రాజాపూర్, నవాబ్ పేట, బాలానగర్ మండలాల పరిధిలోని మాచారం వాగు జీడిగుట్ట తండా వాగు నుంచి రాత్రి వేళల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా ఫిల్టర్ ఇసుకను తరలించి ఇతర ప్రాంతాల్లో తక్కువ ధరకే బాధ్యత విక్రయిస్తున్నారని చెబుతున్నప్పటికీ అధికారులు నామమేత్రంగానే చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. దాదాపుగా 35 టిప్పర్లు రాత్రి సమయంలో ఈ ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ ఇసుక తక్కువ ధరకు తరలింపు చేయడం ద్వారా నిబంధనలు పాటిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ విషయంపై పోలీసులు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. కావాలని అధికారం యంత్రంగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తాము ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూడతామని చెప్పారు. ఆరు అక్రమ ఇసుక వాహనాలే పోలీసులు పట్టుకున్నారని, మరెన్నో పోతున్నాయన్నారు. ఇప్పటికైనా అక్రమ ఇసుక రవాణాను అరికట్టి, అనుమతులు లేకుండా ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.