గండి మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ
ముషీరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ముషీరాబాద్ డివిజన్ భరత్ నగర్ లోని ప్రసిద్ధిగాంచిన గండి మైసమ్మ దేవాలయ అమ్మవారికి మంగళవారం ముషీరాబాద్ మహాంకాళి దేవాలయం నుంచి సంప్రదాయ పద్దతిలో ఊరేగింపుగా అమ్మవారికి పట్టు వస్త్రాలను తీసుకెళ్లి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని ముషీరాబాద్ మహాంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ నరేష్, ప్రధాన అర్చకుడు వై. చంద్రమౌళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఎయిర్టెల్ రాజు, కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షుడు జనిగె శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ బి-బ్లాక్ కమిటీ ఉపాధ్యక్షుడు పట్నం నాగభూషణం గౌడ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు డి. శివముదిరాజ్, ఆలయ కమిటీ ధర్మకర్తలు రాము, అశోక్, అనసూయ, బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






