తుకారాంగేట్ ఇన్స్‌పెక్టర్‌గా బషీర్ అహ్మద్
29-07-2026 12:41 AM
సికింద్రాబాద్, జూలై 28 (విజయక్రాంతి): తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బషీర్ అహ్మద్ బాధ్యతలు చేపట్టారు.ఇది వరకు మార్కెట్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తించిన ఆయన తుకారాంగేట్ గా స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు. నేరల నియంత్రనకు తగిన చర్యలు తీసుకుంటా మని, ప్రజలు కూడా తమ ఇల్లు, కార్యాలయాల పరిసరాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని బషీర్ అహ్మద్ పేర్కొన్నారు.






