29 July, 2026 | 1:35 AM

హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

29-07-2026 12:41 AM

మేడ్చల్, జూలై 28(విజయ క్రాంతి) ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో  అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని  జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారి డా. కె. ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  హెపటైటిస్ అనేది కాలేయం (లివర్) వాపుకు కారణమయ్యే తీవ్రమైన వ్యాధి అని, సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే లివర్ సిరోసిస్, లివర్ వైఫల్యం, లివర్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ్రఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా వైద్యాధికారి మల్కాజ్గిరి డివిజన్  డా.లావణ్య రెడ్డి, జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా శ్రీదేవి,జిల్లా సర్వేలన్స్ అధికారి డా నాగరాజ్  ప్రాథమిక ఆరోగ్యకేంద్రం అల్వాల్ వైద్యఅధికారి శ్రీకాంత్, వైద్య  సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.