ఆందోళన చెందవద్దు ఆదుకుంటాం: ఎమ్మెల్యే జాదవ్ అనిల్
01-09-2026 12:57 PM
బోథ్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): సోనాల మండలంలోని కూల్‌సింగ్ నాయక్ తండలో అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన రాథోడ్ గులాబ్‌సింగ్, జోర్‌సింగ్ కుటుంబాలను ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పరామర్శించారు. మంగళవారం ఘటనాస్థలిని పరిశీలించి తక్షణ ఆర్థిక సహాయం అందించారు. బాధితులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వపరంగా పరిహారం అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లేష్, ఎంపీడీవో రత్నాకర్‌రావు, సర్పంచ్ బాబుసింగ్, మండల నాయకులు పాల్గొన్నారు.






