మల్లాపూర్ కొత్త బస్‌స్టాండ్‌కు రంగులు వేయాలి
01-09-2026 12:30 PM
మల్లాపూర్, సెప్టెంబర్ 01(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్‌స్టాండ్‌కు, పాత బస్‌స్టాండ్‌లోని బస్‌షెల్టర్లకు అసంపూర్తిగా రంగులు వేయడంతో వాటికి పూర్తిస్థాయిలో రంగులు వేయించాలని సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్‌రెడ్డి ఆర్టీసీ అధికారులను కోరారు.
కొత్త బస్‌స్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం విద్యుత్ సదుపాయం కల్పించాలని, మూత్రశాలల్లో నీటి వసతి ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కొత్త బస్‌స్టాండ్‌కు ప్రహరీ నిర్మించి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరారు.






