యువత లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలి
01-09-2026 11:49 AM
బోథ్, సెప్టెంబర్ 1(విజయక్రాంతి): యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య పిలుపునిచ్చారు. మంగళవారం సోనాల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని వారు ప్రారంభించారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






