బొందలపల్లిలో బగ్గుమన్న పాత కక్షలు.!
01-09-2026 11:59 AM
*గెట్టు పంచాయతీ మనసులో పెట్టుకొని తండ్రి, కొడుకులపై దాడి
* కర్రలు, రాళ్లతో దాడి.. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి తరలింపు
* దాడి ఘటనను ఫోన్‌లో రికార్డు చేసిన బాధితులు.. గ్రామంలో ఉద్రిక్తత
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా బొందలపల్లి గ్రామంలో భూ పంచాయతీకి సంబంధించిన పాత కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. భూ గెట్టు వివాదం నేపథ్యంలో తండ్రి, కొడుకులపై 10 మందికిపైగా వ్యక్తులు కర్రలు, రాళ్లతో మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో స్థానికులు వారిని జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు..ఘటనను బాధితులు ఫోన్‌లో రికార్డు చేయగా, వీడియో వైరల్‌గా మారింది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.






