నర్సు శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండ: మంత్రి సీతక్క
01-09-2026 01:08 PM
ములకలపల్లి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ హత్యకు గురైన ఊకె శిరీష కుటుంబాన్ని మంత్రి సీతక్క, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నష్టపరిహారంగా రూ.5 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పించడంతో పాటు ఐటీడీఏ ద్వారా సహాయం, జీవనోపాధికి ప్రభుత్వ భూమి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. శిరీష హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






