2వ వార్డులో మున్సిపల్ కమిషనర్ పర్యటన
01-09-2026 12:54 PM
పారిశుధ్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
బాన్సువాడ, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని 2వ వార్డులో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మంగళవారం పర్యటించారు. పారిశుధ్యం, డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, తదితర మౌలిక వసతులను పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఎస్‌ఐఆర్ నోటీసుల జారీ వివరాలను బీఎల్‌ఓ మాధవిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జంగం రాజశేఖర్, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.






