విజయక్రాంతి ఎఫెక్ట్: ఆధార్ సేవలు పునరుద్ధరణ
01-09-2026 12:50 PM
కేసముద్రం, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సబ్ పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవలు పునరుద్ధరించారు. ఇటీవల పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవలను నిలిపివేసిన సంఘటనపై గత జులై 24న ‘ఆధారం లేని కేసముద్రం' శీర్షికతో ‘విజయక్రాంతి' పత్రికలో ప్రచురించిన వార్త కథనానికి అధికారులు స్పందించారు. నెలరోజులుగా ఇబ్బందులు పడుతున్న ఆధార్ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ.. విజయక్రాంతి పత్రికకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.






