వికసిత్భారత్ కార్యక్రమంలో చేపట్టే పనులపైన చర్చ
01-09-2026 11:51 AM
బోథ్, సెప్టెంబర్ 1(విజయక్రాంతి): మండలంలోని తరత్వడ గ్రామపంచాయతీలో మంగళవారం గ్రామ సర్పంచ్ దుర్వా విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో 2027 28 సంవత్సరంలో చేపట్టే పనులను గ్రామ సభలో గుర్తించి తీర్మానించారు. కార్యక్రమంలో ఈసీ మధుకర్ గ్రామపంచాయతీ కార్యదర్శి సుల్తానా ఉప సర్పంచ్ త్యాగల గంగామణి ఫీల్డ్ అసిస్టెంట్ మండలి రాము వార్డు సభ్యులు భీమ లింగుతదితరులు పాల్గొన్నారు.






