7 May, 2026 | 1:10 PM

మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి

07-05-2026 12:21 PM

బోథ్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ పదవి ని భర్తీ చేయడంతోబోథ్  మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి(Both Market Committee Chairman Post ) భర్తీపై ఈ ప్రాంత నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకునికి ఉమ్మడి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పట్టుబట్టి ఇప్పించేందుకు ప్రయత్నించారు. నియామకం ప్రక్రియ చివరి దశకు చేరడంతో విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇవ్వవద్దంటూ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకుల ద్వారా తీవ్రవోత్తిడి చేయించినట్లు సమాచారం.

దీంతో ఆయన చైర్మన్ పదవి ఫైలుసంబంధిత శాఖ మంత్రి సంతకం కాకుండానే ఆగిపోయినట్లు తెలిసింది.. ... మంత్రి నిర్ణయంపై పదవి . .... జిల్లా ఇన్చార్య మంత్రి జూపల్లి కృష్ణారావు చేతికి అధిష్టానం మార్కెట్ కమిటీ చైర్మన్ భర్తీ విషయాన్ని అప్పజెప్పినట్లు తెలిసింది. ఎవరికి ఏ స్థాయిలో స్థానికంగా బలం ఉందనేది విషయాన్ని సర్పంచుల ద్వారా అధికార పార్టీలో ఉన్న నాయకుల ద్వారా సమాచారం సేకరించి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టనున్నట్లు తెలిసింది. త్వరలోనే చైర్మన్ పదవిపై నిర్ణయం తీసుకొని ఉన్నట్లు సమాచారం. కాగా చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారిలో పాత కొత్త నేతలు సైతం ఉండడం వల్ల పదవి ఎవరిని వరిస్తుందోనని కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నారు