ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ
07-05-2026 12:20 PM
జిన్నారం/ అమీన్ పూర్: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం, దుబ్వగుంట లలో నాలుగు ఐమాక్స్ లైట్లు కు మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, కమిషనర్ వెంకటరామయ్య, కౌన్సిలర్లు మల్లేష్ , స్వాతి గణేష్ సింగ్, నవీన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజల సౌకర్యార్థం ఐమాక్స్ వీధి దీపాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ర్తెసా కా తున్ ఇబ్రహీం అలీ ఖాన్, సీనియర్ నాయకులు రాజు గౌడ్, దుర్గయ్య యాదవ్, దశరథ్ సింగ్, తదితర నాయకులు పాల్గొన్నారు.






