ప్రజలకు బోనాల శుభాకాంక్షలు
బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలందరికీ బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు బోనాల జాతర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఈ మేరకు ఆ యన ప్రకటనను విడుదల చేశారు. మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం, గంగా-జమున తెహజీబ్‌కు ప్రతీక ఆషాఢ బోనాల జాతర అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ఆత్మగా నిలిచే ఈ పండుగ మన జానపద వైభవానికి, భక్తి శ్రద్ధలకు నిదర్శనమన్నారు.
గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనంతో ప్రారంభమై.. లష్కర్ మహంకాళి జాతర, పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఉత్సవాల వరకు సాగే ఈ సంబురం యావత్ తెలంగాణకు ఒక సరికొత్త పండుగ వాతావరణాన్ని, ఉత్తేజాన్ని తీసుకువస్తుందన్నారు.
ఆ అమ్మవారి చల్లని చూపుతో రాష్ట్రంలోని అన్నదాతలు, శ్రామికులు, ప్రజలందరూ ఆయురారోగ్యా లు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ జాతరను భక్తిశ్రద్ధలతో, అత్యం త సంతోషంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు రాంచందర్‌రావు పేర్కొన్నారు.






