17 July, 2026 | 1:06 AM

పీఆర్‌టీయూ- టీఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభం

17-07-2026 12:52 AM

రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కారంపూడి దశంబాబు 

చర్ల /దుమ్మగూడెం, జులై 16  (విజయక్రాంతి):  పి ఆర్ టి యు టి ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం దుమ్ముగూడెం మండలం నరసాపురంలోని ఎస్ .ఎన్ .ఏ .ఏం  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కారంపూడి దశంబాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం పి ఆర్ టి యు టి ఎస్ సంఘం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు సంఘంలో సభ్యుడిగా చేరి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి. నరసయ్య ,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బి. భాస్కర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. వెంకటి శ్రీనివాసరావు, బి. సైదులు, దుమ్ముగూడెం మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి. శ్రీనివాసరావు, బి. మల్లికార్జునరావు తదితరులు  పాల్గొన్నారు.