31 August, 2026 | 5:15 AM

మహంకాళి ఆలయంలో బోనాల సందడి

31-08-2026 12:46 AM

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త

నాగోల్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నాగోల్లోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శి ంచుకుని ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందా రు. కార్యక్రమానికి టిపిసిసి ప్రధాన కార్యద ర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జా తీయ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరై అ మ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తె లంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బో నాల పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండా లని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ లయ కమిటీ సభ్యులు కన్న గౌడ్, మహేంద ర్ గౌడ్, అనిల్ కుమార్, ప్రవీణ్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.