ఫుట్‌పాత్‌లపై అడ్డంకులు తొలగించండి
చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపండి: ఎమ్మెల్యే కసిరెడ్డి
అమనగల్లు, అగస్టు 30(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి ఫుట్పాత్లపై ఉన్న అక్రమ కట్టడాలను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ర హదారిపై రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పాదచారులు, వాహనదారులకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అదే సమయంలో ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారుల జీవనోపాధి దెబ్బతినకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపునకు ముందు వ్యాపారులకు నోటీసులు జారీ చేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి జీవనోపాధి దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ స్థలాలు ఏర్పాట్లు చూపించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.






