5 August, 2026 | 1:42 AM

నల్ల పోచమ్మకు ఘనంగా బోనాల పండుగ

04-08-2026 05:43 PM

పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం ఆగ్రోస్ చైర్మన్ కాసుల

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బేతాళ స్వామి కాలనీలో గల నల్ల పోచమ్మ ఆలయంలో ఆషాడ మాసం పురస్కరించుకొని మంగళవారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు భవనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు సక్రమంగా నిర్వహించగా, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.