17 August, 2026 | 4:28 AM

పాత నేరేడుచర్లలో ఘనంగా బోనాలు పండుగ

17-08-2026 02:18 AM

నేరేడుచర్ల, ఆగస్టు 16 : వనభోజనాల సందర్భంగా ఆదివారం పాత నేరేడుచర్ల గ్రామదేవతలకు ముత్యాలమ్మతల్లి,లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, దాళo బాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించి బాగా వర్షాలు కురవాలని పంటలు బాగా పండాలని బొడ్రాయి, ముత్యాలమ్మ, దగ్గర మొక్కలు చెల్లించి గ్రామంలోని మహిళలు దేవతలకు బోనాలు సమర్పించిన అనంతరం నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్న పెద్దలు మున్సిపాలిటీ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి, కొణతం ఆదిరెడ్డి కొణతం కాంతారెడ్డి,కొణతం రంగారెడ్డి, కొణతం నాగిరెడ్డి, ఎడవల్లి నర్సిరెడ్డి, కొణతం నర్సిరెడ్డి  కొణతం వెంకటరెడ్డి, తాటికొండ అప్పిరెడ్డి,తాళ్ల సురేష్ రెడ్డి ,కొణతం రాంరెడ్డి,దేవులపల్లి శంకరాచారి, కొణతం వెంకటరెడ్డి టీచర్, కొణతం కృష్ణారెడ్డి, కొణతం శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ రెడ్డి, నాగిరెడ్డిలు పాల్గొన్నారు.