వైభవంగా బోనాల పండుగ
17-08-2026 02:10 AM
మహబూబాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం వివిధ మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, పిల్లా పాప, పశుపక్షాదులు ఆయురారోగ్యాలతో జీవించే విధంగా కరుణించాలని కోరుతూ గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. పలుచోట్ల అంగరంగ వైభవంగా బోనాల పండుగను నిర్వహించారు. డీజే పాటలు, ఆటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో బోనాల పండుగకు కొత్త శోభ సంతరించుకుంది.






