24 August, 2026 | 3:26 AM

సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనం బోనాలు

24-08-2026 12:22 AM

ప్రభుత్వ సహకారంతో ఘనంగా పండుగ.. డాక్టర్ కోట నీలిమ

సికింద్రాబాద్, ఆగస్టు 23 (విజయక్రాం తి):   పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ ని యోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ బన్సీలాల్పేట్, రాంగోపాల్పేట్ డివిజన్లలో నిర్వహించిన బోనాల మహోత్సవాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బన్సీలాల్పే ట్ డివిజన్ సీసీ నగర్లోని నల్లపోచమ్మ, ము త్యాలమ్మ, ఐడిహెచ్ కాలనీలోని కాళీమాత, బోయగూడలోని శ్రీ లక్ష్మీ ఉప్పలమ్మ, గొల్ల కొమరయ్య కాలనీలోని శ్రీ నల్లపోచమ్మ, మహంకాళి, అభయ ఆంజనేయస్వామి, డి క్లాస్ 33లోని రేణుక ఎల్లమ్మ, బిజెఆర్ నగర్లోని బండి మైసమ్మ, శ్రీ నల్లపోచమ్మ ము త్యాలమ్మ ఆలయాల్లో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అదేవిధంగా రాంగోపాల్పేట్ డివిజన్ వెంగళ్రావు నగర్లోని శ్రీ రేణుక ఎల్ల మ్మ, శ్రీ ఉప్పలమ్మ, నల్లగుట్టలోని శ్రీ బ్రహ్మరాంబ ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల నిర్వాహకు లు, ప్రధాన పూజారులు, ఆలయ కమిటీ స భ్యులు సంప్రదాయబద్ధంగా డాక్టర్ కోట నీలిమకు ఘన స్వాగతం పలికారు. అనంత రం ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమా లు నిర్వహించి, అమ్మవార్ల ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ క్రమంలో డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ..

బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బోనాల సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించడం, ప్రజలు కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకోవడం తెలం గాణ ప్రత్యేకతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి, పండుగ నిర్వహణకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తూ ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తోందని తెలిపారు. ఆలయాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, పండుగల సమయంలో అవసరమైన పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, భద్రత వంటి ఏర్పాట్లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

తెలంగాణ పండుగలు, జానపద కళలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలను పరిరక్షిస్తూ వాటికి మరింత ప్రోత్సాహం అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. బోనాల పండుగ సందర్భంగా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవడంతో పాటు పరస్పర సోదరభావం, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. అమ్మవార్ల ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషా లతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.