4 July, 2026 | 9:52 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

అబ్బురపర్చిన బాడీ బిల్డింగ్ పోటీలు

13-02-2026 06:33 PM

బెల్లంపల్లి ఛాంపియన్ గా లక్ష్మణ్..

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో స్కై జిమ్ ఆధ్వర్యంలో సింగరేణి కళావేదికలో గురువారం రాత్రి  సింగరేణి క్లాసిక్ బాడీ బిల్డింగ్ పోటీలు అబ్బురపరిచాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఖమ్మం,ఉమ్మడి వరంగల్ స్థాయిలో నిర్వహించిన ఈ బాడీ బిల్డింగ్ పోటీల్లో ఛాంపియన్ గా గుండం లక్ష్మణ్ ( స్కై జిమ్  బెల్లంపల్లి) టైటిల్ సాధించారు. జూనియర్ ఛాంపియన్ గా కొలిపాక నితీష్ (సి సి సి ), బెల్లంపల్లి ఛాంపియన్ గా లక్ష్మణ్ టైటిల్ సాధించారు.

50 కిలోల విభాగంలో మునీష్,55 కిలోల విభాగంలో అనిల్,60 కిలోల విభాగంలో ఎం వెంకటేష్, 65 కిలోల విభాగంలో జి లక్ష్మణ్, 70 కిలోల విభాగంలో శిశిరుత్, 75 కిలోల విభాగంలో ముజామ్మి ఖాన్  80 కిలోల విభాగంలో ఎన్ వెంకటేష్, 85 ప్లస్ విభాగంలో ఎండి సోయబ్ గెలుపొందారు. దాదాపు 100 మంది బాడీ బిల్డర్లు ఈ పోటీలో పాల్గొన్నారు. న్యాయ నిర్నేతలుగా మిస్టర్ ఇండియా రాజు, ఓరం సురేష్, నాగమల్లేశ్వరరావు, ఇంతియాజ్, శ్రీనివాస్ వ్యవహరించారు. మాజీ అడిషనల్ ఎస్పీ రవికుమార్ జిమ్ నిర్వాహకులు పి.సదానందం,జె. చంద్రశేఖర్ జె. మురహరి రావు వెంకటేశ్వర్లు, గిరి ప్రసాద్, కుప్పిరాల విజయ్, మోబిన్ ఖాన్, జక్కుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వ్యాఖత్తగా కె. నగేష్ వ్యవహరించారు.