4 July, 2026 | 11:13 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఎల్లంపేట గడ్డ.. బీఆర్ఎస్ కు ఎదురులేని జీవగడ్డ

13-02-2026 06:35 PM

జవహర్ నగర్ నాయకుల సంబురాలు.                     

జవహర్ నగర్, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ఎల్లంపేట మున్సిపాలిటీలో బిఆర్ఎస్ అభ్యర్థులు సత్తాచాటి ఎదురులేని గెలుపును సాధించారు. ఈ మేరకు శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎల్లంపేటలో పోటీ చేసిన బిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో జవహర్ నగర్ నాయకులు సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభంజనం సృష్టించిందని ప్రజల్లో ఆదరణ తగ్గలేదు అనేందుకు ఈ ఎన్నికలే నిదర్శనం అన్నారు. గత 10 ఏండ్ల లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ ను అభివృద్ధి పథంలోకి నడిపించారని బిఆర్ఎస్ చేసిన ప్రగతి పనులకు, సంక్షేమానికి, ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సంగీత రాజశేఖర్, పల్లపు రవి, ఉద్యమకారుల ఫోరం జవహర్ నగర్ అధ్యక్షుడు సుధాకర్ చారి, మాజీ కోఆప్షన్ సభ్యురాలు శోభా రెడ్డి, నాయకులు మహేష్, కాసిం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.