calender_icon.png 7 February, 2026 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బా గాంధీ పాఠశాల ఎస్ఓపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

06-02-2026 09:16:25 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): కస్తూరిబా గాంధీ పాఠశాల ఎస్ఓపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ముదిగొండ ప్రశాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల నందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తల్లిదండ్రుల సమాచారం మేరకు ఎస్ఎఫ్ఐ నాయకులు ముదిగొండ ప్రశాంత్ హాస్టల్ వద్దకు వెళ్ళి విద్యార్థిని తీగుళ్ళ గౌతమి ని సమస్యలు ఆడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ పాఠశాల నందు విద్యార్థినీలు భోజనంలో పురుగులు, దోడ్డు బియ్యం, ఉడికిఉడకని భోజనంతో రాత్రి సమయంలో కడుపులో నొప్పి వస్తుందని విద్యార్థినిలు ఎస్ఎఫ్ఐ నాయకుల దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రభుత్వాలు విద్యార్థినుల సంక్షేమం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని ములకలపల్లి కస్తూరిబా గాంధీ పాఠశాల లో అవేవీ పట్టనట్లుగా ఎస్ ఓ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఉడికిఉడకని అన్నం తిని రాత్రి సమయంలో కడుపులో మంట, నోప్పి వస్తుందని విద్యార్థినీలు తమకు తెలిపారని హాస్టల్ లో భోజనం రుచికరంగా లేదని విద్యార్థీనీలు ఎవరైనా తల్లిదండ్రులకు తెలియపరిస్తే ఆ విద్యార్థినీని టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థులు తమ దృష్టికి తీసుకు వచ్చారన్నారు.ములకలపల్లి కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థుల సమస్యల పై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 

ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, ఎస్ఎఫ్ఐ నాయకులు నాగచైతన్య, చందు,సింధు,ప్రియ,లావణ్య, మౌనిక, తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ విషయమై కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల స్పెషల్ ఆఫీసర్ మల్లీశ్వరిని వివరణ కోరగా గౌతమి అనే విద్యార్థినీని బయటకు పంపాలని తన తల్లి  కోరగా ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉన్నందువలన పంపడం వీలు పడదని  చెప్పినందుకు అవాస్తమైన ఆరోపణలు చేశారని ఆమె తెలిపారు.