11 May, 2026 | 9:42 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

రేగులగుంటలో ఘనంగా నాభిశిల ప్రతిష్ట

11-05-2026 08:21 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం రేగులగుంట గ్రామంలో సోమవారం శ్రీ సీతాల పరమేశ్వరి నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 11వ తేదీ వరకు మూడు రోజులపాటు గ్రామంలో ప్రతిష్ట పూజా కార్యక్రమాలు చేశారు.

పరాభవనామ సంవత్సర వైశాఖబహుళ నవమి ఏకాదశి నక్షత్ర యుక్త కర్యాటక లగ్న శుభ ముహూర్తంన గ్రామస్తులందరి సమక్షంలో నాభి శిల(బొడ్రాయి)ని సోమవారం ఉదయం ప్రతిష్టించారు.ప్రతిష్టను మంగళ వాయిద్యాల మధ్య ఘనంగా నిర్వహించారు.జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్ దంపతులు,గ్రామ పెద్దలు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.గ్రామ రక్షణ,దుష్టశక్తులు దూరంగా ఉండాలని ఐక్యత,శాంతి గ్రామంలో నెలకొనాలని వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.వివాహమై ఇతర గ్రామాలకు వెళ్లిన ఆ ఊరి ఆడబిడ్డలు గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.