2 June, 2026 | 3:47 AM

ప్రభుత్వ విప్ వీరేశం జన్మదిన సందర్భంగా రక్తదానం

02-06-2026 01:09 AM

కట్టంగూర్ జూన్ 1 : నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభు త్వ విప్ వేముల వీరేశం పుట్టినరోజు సందర్భంగా నకిరేకల్ మెయిన్ రోడ్డు ఇందిరాగాంధీ సర్కిల్ వద్ద సోమవారం రక్త దాన శిబిరం నిర్వహించారు. డిసిసి అధ్యక్షుడు పూన కైలాసనేత ఈ రక్తదానశిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు నిరంతరం ప్ర జల మధ్య ఉంటూ పనిచేస్తున్న విప్ వీరేశం జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున యువత పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు స్వీట్ పంపిణీ చేశారు, పండ్లు పంపిణీ చేశారు బట్టర్ మిల్క్, అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీనివాస్ రజిత , సర్పంచులు ఉప సర్పంచులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.