ముగిసిన సరస్వతి అంత్య పుష్కరాలు
- చివరి రోజు మంత్రులు గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ పుష్కర స్నానాలు
- ముగింపు వేడుకల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- ఆధ్యాత్మిక వైభవానికి వేదికగా కాళేశ్వరం
కాళేశ్వరం/మహబూబాబాద్, జూన్ 1 (విజయక్రాంతి) : ఆధ్యాత్మిక వైభవానికి వేదికగా జయశంకర్ జిల్లా భూపాలపల్లి కాళేశ్వ రం నిలిచింది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నది, త్రివేణి సంగమక్షేత్రం కాళేశ్వరంలో 12 రోజుల పాటు జరిగిన సరస్వతి అంత్య పుష్కరాలు సోమవారం ముగి శాయి. తెలంగాణతో పాటు దేశంలోని వివి ధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కాలేశ్వరం చేరుకొని సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు తర్ప ణాలు సమర్పించారు.
చివరి రోజు మంత్రులు గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ పుష్కర స్నానం ఆచరించారు. పుష్కర స్నానం ఆచ రించిన అనంతరం మంత్రులు శ్రీ ముక్తేశ్వర స్వామిని, శుభనంద దేవి ఆలయాలను సందర్శించి దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ హ నుమంతరావు, దేవాలయ చైర్మన్ మోహన శర్మ, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.
పు ష్కరాల నిర్వహణలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేశాయి. పన్నెండు రోజుల పా టు సాగిన సరస్వతి అంత్య పుష్కరాలు భక్తి, ఆధ్యాత్మికత, సంస్కృతి, సేవా కార్యక్రమాల సమ్మేళనంగా నిలిచాయి. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం క్షేత్రంలో నిర్వహించిన తెప్పోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ప్రత్యేకంగా అలంక రించిన తెప్పపై శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి, దేవేరి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి సంగమ జలాల్లో విహరింపజేశారు. కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్క రాల సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక చొరవతో ఏర్పాటు చే సిన శిలా సంపద మ్యూజియం అంత పుష్కరాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మ్యూజియంలో భద్రపరచిన అద్భుతమైన శిల్ప సంపదను భక్తులు ఆసక్తిగా తిలకించారు.
పుష్కరాలు విజయవంతం : మంత్రి శ్రీధర్‌బాబు
ముగింపు వేడుకలకు హాజరైన మంత్రి శ్రీ ధర్‌బాబు మాట్లాడుతూ.. గత ఆది పుష్కరాలు, ఇప్పటి అంత్య పుష్కరాలు విజయ వంతంగా నిర్వహించుకున్నామని తెలిపారు. అధికార యంత్రాంగం అద్భుతమైన ఏర్పా ట్లు చేసిందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 200 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు న మ్మికతో ఈ కాళేశ్వరం దర్శనానికి వస్తుంటారని, సరస్వతి పుష్కరాలు మొట్టమొదటి సా రి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
కార్యక్ర మంలో ఎమ్మెల్యేలు విజయరమణరావు, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, గండ్ర సత్యనారాయ ణ, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, సర్పంచ్ మోహన్‌రెడ్డి, మోహన్ శర్మ, గ్రం థాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, దేవాల య ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.






