18 April, 2026 | 6:25 PM

తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకుందాం

18-04-2026 04:53 PM

సుల్తానాబాద్ కోర్టు జడ్జి దుర్గం గణేశ్

న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రక్తదానం చేసి తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకుందామని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. శనివారం తలసేమియా బాధితులకు కోసం మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో స్థానిక కోర్టు ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్ తో పాటు పలువురు న్యాయవాదులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది, యువకులు రక్తదానం చేసారు. ప్రతిమ ఫౌండేషన్ మేనేజర్ వినయ్ కుమార్, బ్లడ్ సెంటర్ మేనేజర్ డాక్టర్ నిరంజన్ సిబ్బంది రక్తాన్ని సేకరించారు.

శ్రీకర కో ఆపరేటివ్ సొసైటీ బ్రాంచి మేనేజర్ అంతటి సంతోష్ కుమార్ రక్తదాతలకు పండ్లు, ద్రాక్ష పండ్ల రసాలు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ రక్తదానం ద్వారా తలసేమియా బారిన పడిన చిన్నారుల ప్రాణాలను కాపాడిన వారమవుతామని అన్నారు. రక్తదానం ప్రాణ దానంతో సమానమని అన్నారు. అనంతరం ప్రతిమ హాస్పిటల్ వారి సర్టిఫికెట్స్ ను జడ్జి గణేష్ రక్తదాతలకు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వొడ్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శి అవునూరి సత్యనారాయణ, ఏజీపీ దూడం ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు ఆవుల శివకృష్ణ, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, కార్యదర్శి అమిరిశెట్టి తిరుపతి, న్యాయవాదులు పడాల శ్రీరాములు, బోయిని భూమయ్య, సామల రాజేంద్ర ప్రసాద్, పెగడ శ్యామ్ సుందర్, కోడం అజయ్, చీకటి సంతోష్, వంగల యుగేందర్ రెడ్డి, బొబ్బిలి శ్యామ్, వేముల స్నేహ, లెక్కల గంగాధర్, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.