మహిళా బిల్లును అడ్డుకోవడం హేయం
24-04-2026 07:37 PM
బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి
సిద్దిపేట క్రైం: పుట్టబోయే బిడ్డను పురిటిలోనే తుంచి వేసినట్టు ఇండి కూటమి మహిళా బిల్లును పాస్ కాకుండా అడ్డుకోవడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరిఅంజిరెడ్డి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో శుక్రవారం నారీశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ మైనారిటీలకు వ్యతిరేకమని కాంగ్రెస్ కూటమి ఎన్నో రకాలుగా దుష్ప్రచారం చేసినప్పటికీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్రిబుల్ తలాక్ ను రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛ వాయువులను ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు.






