20 April, 2026 | 8:36 AM

బిల్లును అడ్డుకోవడం దురదృష్టకరం

20-04-2026 12:00 AM

మహబూబ్ నగర్ టౌన్, ఏప్రిల్ 19: నారి శక్తివంతం బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డుకోవడం దురదృష్టకరమని బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా నారి శక్తివంతం బిల్లును అడ్డుకోవడం పట్ల ప్రతిపక్షల దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమానత్వం అన్నప్పుడు మహిళలకు సముచిత స్థానం కల్పించడం ప్రతిపక్ష పార్టీలకు ఎందుకు ఇష్టం లేదని విమర్శించారు. మంచి చేయాలని సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తుంటే అడ్డుకోవాలని సంకల్పం తప్ప వారికి ప్రజలకు మంచి చేయాలని తపన లేదని విమర్శించారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అచ్చుగట్ల అంజయ్య,జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి, భగీరథ కాలనీ కార్పొరేటర్ పాండురంగారెడ్డి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెడ్ల కృష్ణయ్య జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహితి రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొత్తగంజి కార్పొరేటర్ పిట్టల యాదయ్య, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఫరూక్, నాయకులు గాల్ రెడ్డి, పెద్ద నర్సింలు , పోతుల రాజేందర్ రెడ్డి,జాజం సుబ్రహ్మణ్యం, జ్యోతి రెడ్డి, బాలేశ్వ రమ్మ, ధర్పల్లి హరికృష్ణ, మిట్ట వీధి నాగరాజు ,శ్రీశైలం యాదవ్, కరుణాకర్ రెడ్డి, అనంతరెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, గుబ్బ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.