పంది కడుపులో ఏనుగు పోలికతో వింత పిల్ల జననం
పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 19: నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని పె ద్ద కార్పాముల గ్రామంలో ఆదివారం వింత సంఘటన చోటుచేసుకుంది. పంది కడుపులో ఏనుగు పిల్లను పోలి ఉండే ఆకారం తో ఒక పిల్ల జన్మించడంతో గ్రామంలో ఆసక్తి నెలకొంది. గ్రామానికి చెందిన కూర వెంకటయ్య పందుల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు.
అతని పందిలో ఒకటి మొదటి ఈతలో మొత్తం ఏడు పిల్లలను ప్రసవించింది. ఇందులో రెండు పిల్లలు మృతిచెందాయి. మృతిచెందిన వాటిలో ఒకటి అచ్చం ఏనుగు పిల్లను పోలి ఉండే ఆకారంలో ఉండటంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ విషయం గ్రామంలో వ్యాపించడంతో పందుల యజమాని ఇంటికి ప్రజలు చేరుకుని ఆ వింత పిల్లను చూసేందుకు బారులు తీశారు. ఈ విషయాన్ని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఉల్లంగొడ్ల మల్లేష్ తెలిపారు.: వైద్య నిపుణుల ప్రకారం ఇలాంటి ఘటనలు సాధారణంగా జంతువుల్లో జన్యు లోపాలు గర్భస్థ శిశువు అభివృద్ధిలోలోపాలతో జరుగుతాయని చెబుతున్నారు.






