ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా ఎయిర్ ఇండియా
గురుగ్రామ్, జూలై 2026:
ప్రపంచంలో 4వ అత్యుత్తమ సమయపాలన పాటించే ఎయిర్‌లైన్‌గా ఎయిర్ ఇండియా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. విమానయాన విశ్లేషణ సంస్థ సిరియం విడుదల చేసిన జూన్ 2026 ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ప్రకారం, ఆ నెలలో ట్రాక్ చేయబడిన 15,135 విమానాలలో ఎయిర్ ఇండియా 86.85% ఖచ్చితమైన ఎరైవల్ రేట్ (సమయానికి రాక)ను నమోదు చేసింది.
ఈ ఎయిర్‌లైన్ 86.23% ఖచ్చితమైన డిపార్చర్ రేట్ (సమయానికి బయలుదేరటం) ను నమోదు చేయటంతో పాటుగా 99.7% కంప్లీషన్ ఫ్యాక్టర్ ను కూడా నమోదు చేసింది, అంటే వాస్తవంగా అన్ని షెడ్యూల్డ్ విమానాలు ప్రణాళిక ప్రకారం నడిచాయి. ఇది ఎయిర్ ఇండియా యొక్క కార్యాచరణ శ్రేష్ఠత, షెడ్యూల్ సమగ్రతపై ఎయిర్‌లైన్ యొక్క నిరంతర దృష్టిని నొక్కి చెబుతోంది. ఈ ఘనత నిర్వహణపరమైన స్థిరత్వం, సమర్థవంతమైన నెట్‌వర్క్ ప్రణాళిక, కార్యాచరణలో నిరంతర మెరుగుదలకు ఎయిర్ ఇండియా చేస్తున్న పెట్టుబడులకు నిదర్శనంగా నిలిచింది.
భారతదేశంలోని రెండు అతిపెద్ద విమానాశ్రయాలైన ఢిల్లీ మరియు ముంబైలను కేంద్రంగా చేసుకుని పెద్ద సంఖ్యలో దేశీయ మరియు అంతర్జాతీయ విమానయాన సేవలను అందించే ఒక హబ్-అండ్-స్పోక్ నెట్‌వర్క్ క్యారియర్‌గా, ఎయిర్ ఇండియా తమ షెడ్యూల్ విశ్వసనీయతను బలోపేతం చేయడానికి , వినియోగదారులకు మరింత స్థిరమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి అనేక చర్యలను చేపట్టింది. వీటిలో బయలుదేరే సమయపాలనను మెరుగుపరచడం, విమానాల టర్నరౌండ్ ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, రియల్-టైమ్ నెట్‌వర్క్ పర్యవేక్షణను మెరుగుపరచడం , విమానయాన సంస్థ అంతటా వేగవంతమైన కార్యాచరణ నిర్ణయాలు తీసుకునేలా చేయడం వంటివి ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు, గగనతల ఆంక్షలు, విమానాశ్రయ రద్దీ, సాంకేతిక సమస్యలు వంటి ఊహించని అంతరాయాలకు సమర్థవంతంగా స్పందించడానికి అవసరమైన కార్యాచరణ సౌలభ్యాన్ని కొనసాగించడంపై ఈ విమానయాన సంస్థ దృష్టి సారించింది.






