20 April, 2026 | 10:30 AM

ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

20-04-2026 12:00 AM

జడ్చర్ల (మిడ్జిల్), ఏప్రిల్ 19: మండలం రాణి పెట్ గ్రామానికి చెందిన బోయ మల్లేష్ గత కొద్ది రోజుల క్రితం కొత్తపల్లి దగ్గర జరిగిన బైక్ కారు ఆక్సిడెంట్ లో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ ద్వారా మాజీ మంత్రి బాధిత కుటుంబానికి రూ 15 వేలు ఆర్థిక సహాయాన్ని మృతుని భార్య రేణుకకు స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ నిరంజన్, బీఆర్‌ఎస్ గ్రామ కమిటి అధ్యక్షులు అమిర్, నాయకులు షబ్బీర్,జగన్ మగ్బుల్, కలిమ్ రహేమాన్,పాషా,నర్సింహా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.