12 July, 2026 | 7:01 PM

ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్

12-07-2026 06:05 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఖేలో ఇండియాలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఖో ఖో శిక్షణ కేంద్రాన్ని డివైఎస్ఓ సురేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు పుట్టినిల్లు అయిన సుల్తానాబాద్ మండలంలో ఖోఖో సెంటర్ ఏర్పడడం క్రీడాకారులకు ఒక మంచి అవకాశం అని దానిని సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్థిని, విద్యార్థులు వారు ప్రత్యేక చూపించి ఖోఖో కోచ్ గెల్లు  మదకర్ ఆధ్వర్యంలో ఉత్తమమైన శిక్షణ పొంది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో అత్యుత్తమైన ప్రతిభను ప్రదర్శించి మన జిల్లా కీర్తిని భారత దేశ స్థాయిలో గుర్తింపు తేవాలని కోరారు. మన ఖో ఖో సెంటర్ కోచ్ గెల్లు మధుకర్ యాదవ్ అంతర్జాతీయ క్రీడాకారుడిగా గుర్తింపు తీర్చిదిద్దిన జిల్లాను మరల మీరు దేశవ్యాప్తంగా గుర్తింపు చెందేలా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పేటి సంఘం కార్యదర్శి దాసరి రమేష్, సుల్తానాబాద్ మండల ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ ప్రణయ్ లు పాల్గొన్నారు.