మూడు రాష్ట్రాల్లో గెలుపుతో బీజేపీ కార్యకర్తల సంబరాలు
05-05-2026 12:52 AM
గాంధారి, మే 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో భాజపా కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటాయి. మూడు రాష్ట్రాల్లో భాజపా గెలుపుతో పాటు పశ్చిమ బెంగాల్ లో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చినందుకు మండలానికి చెందిన భాజపా నాయకులు, కార్యకర్తలు మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గెలుపుతో భాజపా దేశం నలుమూలల విస్తరించింది అని, ఎక్కడ ఎన్నికలొచ్చిన గెలుపు భాజపా దేనని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు సాయిబాబా, గాంధారి పట్టణ అధ్యక్షుడు గంగి రమేష్, సత్యం, రామ్ సింగ్, హుస్సేన్, తిమ్మాపూర్ ఉప సర్పంచ్ సంజీవులు, శేఖర్, మహేందర్, రాజు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.






