2 May, 2026 | 9:19 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •  

బీజేపీ అంతుచూస్తా!

26-11-2025 12:23 AM
  1. బెంగాల్ ముఖ్యమంత్రి మమత వార్నింగ్ 
  2. ‘సర్’ ప్రక్రియపై తీవ్ర విమర్శలు
  3. కేంద్రానికి ఈసీ సహకరిస్తోందని ఆరోపణలు

కోల్‌కతా, నవంబర్ 25: ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను గానీ, టీఎంసీనీ శ్రే ణులను గానీ టా ర్గెట్ చేస్తే బీజేపీ అంతుచూస్తా. నా అనుచరులు, పార్టీ శ్రేణులపై జరిగే దాడులను నాపై జరిగినట్లు భావిస్తా. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేస్తా’ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. ఈసీ బెంగాల్ చేపడుతున్న ‘సర్’ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం కోల్‌కతాలో నిర్వహించిన సభలో ఆమె బీజేపీపై నిప్పులు చెరిగారు.

‘సర్’ ప్రక్రియ బీజేపీ కనుసన్నల్లో జరుగుతున్నదని ఆరోపించారు. మున్ముందు ఎన్నికలు ఉన్నందువల్లే బీజేపీ మళ్లీ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి మాట్లాడుతోందని, మతపరమైన కార్డును వినియోగించుకుంటున్నదని మండిపడ్డారు. ధర్మం పేరుతో బీజేపీ అధర్మాన్ని ఆచరిస్తోందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఏజెన్సీలు, వనరులను వాడుకున్నా, బీజేపీ తనతో పోరాడి గెలవలేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు.