కొత్తపేటలో బీజేపీ రంగోలి, చాయ్ పే చర్చ
నాగోల్, మే 5 (విజయక్రాంతి): సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్లో ఈనెల 10న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ సభ నేపథ్యంలో, అలాగే మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ఘనవిజయాన్ని పురస్కరించుకుని కొత్తపేట డివిజన్లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో రంగోలి, చాయ్ పే చర్చ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. మహిళా మోర్చా అధ్యక్షురాలు వైజయంతి నివాసం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా ప్రభారి, ఎల్బీనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ సామరంగా రెడ్డి, కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు శైలజ, డివిజన్ అధ్యక్షుడు మంచి రాజేష్ కుమార్, కౌన్సిల్ సభ్యురాలు కాట విజయ గౌడ్, జంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరడంతో ప్రజలు మళ్లీ మళ్లీ బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. కొత్తపేట డివిజన్‌కు చెందిన పలువురు నాయకులు, మహిళా కార్యకర్తలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






