నిందితుడి అరెస్ట్
06-05-2026 02:56 AM
సనత్‌నగర్, మే 5 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లో ఏటీఎం నగదు దుర్వినియోగం కేసు వెలుగులోకి వచ్చింది. సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ సికింద్రాబాద్ బ్రాంచ్ మేనేజర్ పి.నవీన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఏటీఎంలకు నగదు నింపే బాధ్యతలు నిర్వహిస్తున్న క్యాష్ కస్టోడియన్ వాసిరెడ్డి సీతారామ్ సుమారు రూ.1.20 కోట్ల నగదును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నా యి. ఏటీఎంల్లో నగదు జమ చేయకుండా, ఆ మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు మళ్లించినట్లు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా వాసిరెడ్డి సీతారామును అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.






